రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించినట్టుగానే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో మరోసారి నిధులు జమ చేయడం ద్వారా, తాము ముమ్మాటికీ రైతు ప్రభుత్వమేనని చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తెలిపారు.

ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయం బలపడితేనే  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనే విశ్వాసంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.