ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోగమే..వచ్చే ఏడాదికి ఫలితాలు వస్తాయి

ఇథనాల్ బ్లెండింగ్  ప్రయోగమే..వచ్చే ఏడాదికి ఫలితాలు వస్తాయి
  • వచ్చే ఏడాదికి ఫలితాలు వస్తాయి.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ:  పెట్రోల్‌‌‌‌‌‌‌‌లో 20 శాతం ఇథనాల్ కలపడం (ఈ20) అనేది ఒక ప్రయోగమని.. ఈ విధానం పూర్తి ఫలితాలు వచ్చే ఏడాది నాటికి మరింత స్పష్టంగా తెలుస్తాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే, ఇథనాల్ బ్లెండింగ్ అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి స్పష్టం చేశారు.

పెట్రోల్‌‌‌‌‌‌‌‌లో ఇథనాల్ శాతం పెంచడం వల్ల పాత వాహనాల ఇంజన్లు దెబ్బతింటాయని, మైలేజ్ తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలకు నష్టం జరుగుతుందనడానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని, ఈ విధానం వల్ల దేశ ఇంధన భద్రతకు, రైతులకు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని భరోసా ఇచ్చింది. అలాగే, ఈ20 ఇంధనం వాడటం వల్ల వాహన ఇన్సూరెన్స్ క్లెయిమ్‌‌‌‌‌‌‌‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది.

2025–26 సరఫరా సంవత్సరానికి గాను ఇథనాల్ కేటాయింపులపై కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వును సవాలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టెండర్ ప్రక్రియ ముగిసేలోపు ఒక డిస్టిలరీ అభ్యర్థనను పరిశీలించి ఇథనాల్ కేటాయింపులను పెంచాలని జూన్ 23న కర్నాటక హైకోర్టు ఆదేశించింది. అయితే, ఈ ఆదేశం దేశవ్యాప్తంగా అమలవుతున్న 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యంపై ప్రభావం చూపుతుందని బీపీసీఎల్ కోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వెంకటరమణి వాదిస్తూ.. ‘ఇథనాల్ సరఫరా ఒప్పందాలు ఇప్పటికే అక్టోబర్ 2025లోనే పూర్తయ్యాయి. ఇప్పుడు ఒక సరఫరాదారు అభ్యర్థన కోసం కేటాయింపులను మారిస్తే, ఇతరులు కూడా కోర్టులను ఆశ్రయిస్తారు. దీనివల్ల దేశవ్యాప్త సరఫరా చెయిన్ దెబ్బతింటుంది. రాబోయే అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త సరఫరా ఒప్పందాల పునరుద్ధరణ ఉన్నందున, ఈ లోపే వివిధ హైకోర్టుల్లో ఉన్న ఇలాంటి పిటిషన్లన్నింటినీ ఒకే చోటికి బదిలీ చేయాలి’ అని ఆయన కోరారు.

కర్నాటక హైకోర్టు ఉత్తర్వులపై స్టేటస్​కో

2025-=26 ఇథనాల్ సరఫరా సంవత్సరానికి గాను ఇథనాల్ కేటాయింపులను పెంచాలంటూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మంగళవారం 'యథాతథ స్థితి' (స్టేటస్​కో) విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా అమలవుతున్న 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ జాతీయ విధానాన్ని అతలాకుతలం చేస్తుందంటూ ప్రభుత్వ రంగ చమురు సంస్థ (ఓఎంసీ) దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సుప్రీంకోర్టు స్పందించింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) దాఖలు చేసిన ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విచారించిన జస్టిస్ ఎంఎం సుందరేష్, 
జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం.. సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసింది.