- ఐటీబీపీ 64వ రైజింగ్ డేలో కేంద్ర మంత్రి బండి సంజయ్
న్యూఢిల్లీ, వెలుగు: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు దేశానికి చేస్తున్న సేవలు, త్యాగాలు వెల కట్టలేనివని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. జమ్మూకాశ్మీర్ లో ఉధంపూర్ లోని 15వ ఐటీబీపీ బెటాలియన్ కేంద్రంలో ఐటీబీపీ 64వ రైజింగ్ డే ఉత్సవాలకు సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐటీబీపీ అమరవీరుల స్మారక స్థలికి ఆయన నివాళులర్పించారు.
అనంతరం ఐటీబీపీ పరేడ్ లో ప్రసంగించారు. జీరో నుంచి మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ఐటీబీపీ జవాన్లు చూపిస్తున్న సాహసం, సహనం, అంకితభావం దేశానికి గర్వకారణమన్నారు. దేశ సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని వెల్లడించారు.
ఐటీబీపీ సిబ్బందికి ఆధునిక సాంకేతిక పరికరాలు 0 అందిస్తున్నామని చెప్పారు. సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా నిఘా, రహదారి నిర్మాణం, ఇతర అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఐటీబీపీ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వీరమరణం పొందిన సైనికుల కుటుంబాల కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
