- ఆయా జిల్లా కలెక్టర్లకు బండి సంజయ్ లేఖ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గవర్నమెంట్ స్కూళ్లలో టెన్త్ చదువుతున్న విద్యార్థులందరి ఎగ్జామ్ ఫీజును చెల్లించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి లేఖ రాశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు.
వీరందరికీ పరీక్ష ఫీజు చెల్లించాలంటే రూ.15 లక్షలకుపైగా ఖర్చవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే. పిల్లలకు పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదని తెలుసుకున్న బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని ఆయా స్కూళ్లలో చదివే విద్యార్థుల ఫీజు మొత్తాన్ని తన వేతనం నుంచి చెల్లించాలని నిర్ణయించారు.
