
బండిసంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. పోలీసులు పాదయాత్ర ఆపాలని నోటీసులివ్వండంపై హైకోర్టుకెళ్లి బీజేపీ నేతలు అనుమతి తెచ్చుకున్నారు. దీంతో మూడు రోజుల బ్రేక్ తర్వాత యాత్ర కొనసాగనుంది. జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం పాంనూర్ నుంచి పాదయాత్ర మొదలైంది. ఉప్పుగల్, కూనూర్, గర్మెపల్లి, నాగపురం మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. రేపు భద్రకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది సంజయ్ పాదయాత్ర. అమ్మవారి దర్శనం తర్వాత హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే పాదయాత్ర ముగింపు సభలో సంజయ్ పాల్గొంటారు . మరోవైపు ప్రజా సంగ్రామ పాదయాత్ర సందర్భంగా ఫుల్ సెక్యూరిటీ పెట్టారు. భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.
మరోవైపు పాదయాత్ర ముగింపు సభపై సందిగ్ధత ఏర్పడింది. సభ నిర్వహణకు పోలీసులు అనుమతివ్వకపోడంతో కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది బీజేపీ. ఇప్పటికే సభకు హజరయ్యేందుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీనడ్డా షెడ్యూల్ ఖరారు అయింది. దీంతో సభకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ వేయనన్నారు. ఒకవేళ సభకు కోర్టు అనుమతి ఇవ్వకపోతే రోడ్ షో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.