షాకింగ్.. వెరీ వెరీ షాకింగ్. అస్సలు ఊహించని విధంగా.. పట్టపగలు.. జాతీయ రహదారిపై జరిగిన ఈ దారి దోపిడీ అవాక్కయ్యేలా చేసింది. 2025, డిసెంబర్ 15వ తేదీ జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. పోలీసులు విడుదల చేసిన ఊహా చిత్రాల్లోని వ్యక్తులను పట్టిస్తే 50 వేల రూపాయల రివార్డ్ ప్రకటించటంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ.. లక్నో జాతీయ రహదారి. నేషనల్ హైవే. ఈ దారిలోనే ఈ దారి దోపిడీ జరిగింది. నోయిడాలోని ఓ వ్యాపారవేత్త దగ్గర అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు ఆ వ్యక్తి. డిసెంబర్ 15వ తేదీన హాపూర్ లో వ్యాపారానికి సంబంధించి.. 85 లక్షల రూపాయలు నగదు తీసుకున్నాడు. డబ్బులను బైక్ లో పెట్టుకుని.. తిరిగి నోయిడా వస్తున్నాడు.
ఢిల్లీ.. లక్నో నేషనల్ హైవేపై వెళుతున్న సమయంలో.. ఓ బైక్, ఓ కారు అతన్ని వెంబడించాయి. మొదట బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు.. అకౌంటెంట్ బైక్ ను ఢీకొట్టారు. ఆ వెంటనే ఓ కారు వచ్చిన పక్కనే ఆగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు.. కారులోని వ్యక్తులు అందరూ కలిసి బైక్ పై డబ్బులతో ఉన్న వ్యక్తిని కొట్టారు. అతని దగ్గర ఉన్న డబ్బుల బ్యాగ్ లాక్కొని పారిపోయారు. 15 రోజులుగా ఈ దారి దోపిడీకి సంబంధించిన దోపిడీ దొంగల ఆచూకీ లభించకపోవటంతో.. పోలీసులు రివార్డ్ ప్రకటించారు. ఈ దారి దోపిడీ దొంగల సమాచారం ఇస్తే 50 వేల రూపాయలు ఇస్తామని వెల్లడించారు.
►ALSO READ | బెంగళూరు దేశ రాజధాని కావాలి.. యువతి కామెంట్లపై ఇంటర్నెట్‌లో రచ్చరచ్చ..
డిసెంబర్ మొదటి వారంలోనూ ఇలాంటి దారి దోపిడీనే.. పంజాబ్ రాష్ట్రం లూథియానాలోనూ జరిగింది. అయితే ఆ ఘటనలో బైక్ పై వెళుతున్న ఇద్దరు మహిళలను టార్గెట్ చేశారు.. మరో ఇద్దరు వ్యక్తులు. ఆ ఘటనలో మహిళలు తిరగబడటం.. ఎదురుతిరిగి దాడికి ప్రయత్నించటంతో ఆ దారి దోపిడీదారులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ రెండు ఘటనలు ఒకేలా ఉన్నాయి.. ఏదైనా ముఠా ఇలాంటి దారి దోపిడీలకు పాల్పడుతుందా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు పోలీసులు. జాతీయ రహదారిపై డబ్బులు, ఇతర విలువైన వస్తువులతో వెళ్లే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
