పాదయాత్రపై కాసేపట్లో హైకోర్టులో విచారణ

 పాదయాత్రపై కాసేపట్లో హైకోర్టులో విచారణ

బండిసంజయ్ పాదయాత్రపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రజాసంగ్రామ యాత్ర ఆపాలంటూ స్టేషన్ ఘన్ పూర్ పోలీసులు ఇచ్చిన నోటీసులు క్యాన్సిల్ చేయాలని బీజేపీ కోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టి.. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన హైకోర్ట్..ఇవాళ మొదటి కేసుగా విచారణ చేస్తామని తెలిపింది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే.. పోలీసులు యాత్రకు అనుమతి ఇవ్వలేదని  ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. యాత్రలో సంజయ్ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు.

మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న ఉద్దేశంతోనే అనుమతి నిరాకరించారన్నారు. అయితే 22 రోజుల పాటు పాదయాత్ర జరిగిందని.. ఇప్పటికిప్పుడు అనుమతి లేదని చెప్పడం ఏంటని  న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏ కారణాలు చెప్తూ పాదయాత్ర నిలిపివేశారో.. ఆధారాలు ఇవ్వాలని ఆదేశించారు. తమ దగ్గర ఉన్న వీడియోలు ఇవాళ ఉదయం పదిన్నరకు కోర్ట్ ముందు ఉంచుతామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో కాసేపట్లో సంజయ్ పాదయాత్రపై హైకోర్టు విచారణ జరపనుంది.