రేపు, ఎల్లుండి ఉప్పల్ లో ప్రజాసంగ్రామ యాత్ర

రేపు, ఎల్లుండి ఉప్పల్ లో ప్రజాసంగ్రామ యాత్ర

మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) కార్పొరేషన్ కు రూ.1000 కోట్లను కేటాయించినా ఇప్పటివరకు కనీసం రూ.50 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని ఉప్పల్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్  దుయ్యబట్టారు. హైదరాబాద్ కాప్రా సర్కిల్ కుషాయిగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్  మాట్లాడారు. ఇప్పటివరకు ఉప్పల్ నియోజకవర్గంలో 5 మందికి కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు. అభివృద్ది విషయంలో నియోజకవర్గం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇంతవరకు ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, నాచారం, కాప్రా, చర్లపల్లి తదితర ప్రాంతాల్లోని ఒక్క చెరువును కూడా పర్యాటకంగా అభివృద్దిపర్చలేదని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్టంలో చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర  రేపు(సోమవారం) ఉప్పల్ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వెల్లడించారు. రేపు, ఎల్లుండి ఉప్పల్ నియోజకవర్గంలో విస్తృతంగా బండి సంజయ్ పర్యటిస్తారని చెప్పారు.  ప్రజలు పెద్దఎత్తున బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనాలని ఆయన కోరారు.