స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయండి.. కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

స్టడీ సర్కిల్స్  ఏర్పాటు చేయండి.. కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలన్నారు  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన ఆయన.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువతీ యువకుల కోసం అసెంబ్లీ నియోజకవర్గానికొక స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని కోరారు. గత రెండేండ్లుగా కొవిడ్  వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతీ, యువకులు పోటీపరీక్షల కోసం పెద్ద ఎత్తున ఖర్చుపెట్టే పరిస్థితి లేదన్నారు. ఈ కోచింగ్‌ కేంద్రాలలో శిక్షణ పొందే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా అల్పాహారం, భోజన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని..ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి ఫీజులు నియంత్రించాలని కోరారు. టీశాట్‌, ప్రభుత్వ స్టడీ సర్కిల్స్‌, కోచింగ్‌ కేంద్రాల ద్వారానే నిరుద్యోగ యువతకు శిక్షణనివ్వాలన్నారు. ప్రతిజిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలన్నారు.      వెంటనే టెట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహించాలన్నారు.

మరిన్ని వార్తల కోసం...

సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా?

రేవంత్​కు పీసీసీ ఇవ్వాల్సిన అవసరమేంది?