బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు..ఐదుగురు ఎంపీలు టచ్లో ఉన్నరు: బండి సంజయ్

బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు..ఐదుగురు ఎంపీలు టచ్లో ఉన్నరు: బండి సంజయ్

బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక  వ్యాఖ్యలు చేశారు.  బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు  ఎంపీలు టచ్ లో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చుంటే కేసీఆర్, కవిత ఇప్పటికే జైల్లో ఉండేవారన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఎప్పటికీ ఉండబోదన్నారు.

 బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే  ఎన్డీయేలో చేర్చుకోలేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో  బీజేపీ 17కు 17 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ -బీజేపీ మధ్యేనన్నారు.

also read : కాంగ్రెస్లో చేరిన పట్నం దంపతులు

లోెక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు చెందిన పలువురు  నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి ఝలక్ ఇస్తున్నారు.  ఆ పార్టీకి గుడ్ బై బెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.  ఇటీవలే  పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్  కాంగ్రెస్ లో  చేరారు. ఇవాళ హైదరాబాద్  మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,  వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని.. ఇపుడు బండి సంజయ్  చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారింది.