కేసీఆర్ అనారోగ్యం ఆందోళనకు గురిచేసింది

కేసీఆర్ అనారోగ్యం ఆందోళనకు గురిచేసింది

సీఎం కేసీఆర్ అనారోగ్యానికి గురికావడం ఆందోళనకు గురిచేసిందన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.అమ్మవారి కృపతో కేసీఆర్ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. స్వల్ప అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వచ్చారు. అక్కడ సీఎంకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ముందుగా నార్మల్ టెస్టులు నిర్వహించిన డాక్టర్లు... ఆ తర్వాత సీఎంకు యాంజియోగ్రామ్ టెస్ట్ చేశారు. అయితే యాంజియోగ్రామ్ టెస్ట్ నార్మల్ గా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు. ఎలాంటి బ్లాక్స్ లేవన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు MRI టెస్టు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 



సీఎం కేసీఆర్ కు ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటామన్నారు సీఎం వ్యక్తిగత డాక్టర్ M.V రావు. రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు సీఎం తెలిపారన్నారు. ఎడమ చెయ్యి... ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందనడంతో టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎంకు సిటీ స్కాన్, కార్డియాక్ట్ యాంజియోగ్రామ్ టెస్టులు చేస్తున్నామన్నారు. రెగ్యులర్ పరీక్షల్లో భాగంగానే ఈ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యంగా ఉన్నారన్నారు.