ప్రజలు, ఉద్యమకారులు కలిసొస్తే టీఆర్ఎస్ కు సమాధే

ప్రజలు, ఉద్యమకారులు కలిసొస్తే టీఆర్ఎస్ కు సమాధే

హైదరాబాద్: అమరవీరుల త్యాగమే తెలంగాణ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కానీ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా, భిన్నంగా మూర్ఖ పాలన సాగుతోందన్నారు. 2023లో TRS పార్టీని సమాధి చేస్తామని చెప్పారు. ఇందుకోసం అన్ని వర్గాల ప్రజలు, ఉద్యమకారులు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. అందరూ బీజేపీలోకి రావాలని, కేసీఆర్ పై పోరాటం సాగిద్దామని కోరారు.

'బీజేపీ నేత, తెలంగాణ ఆడబిడ్డ సుష్మా స్వరాజ్ మన రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించింది. ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఆ రోజు పార్లమెంటులో కేసీఆర్ లేనే లేడు. కేసీఆర్ కుటుంబం, ఎంఐఎం కోసమేనా తెలంగాణ తెచ్చుకున్నామని చాలా మంది మేధావులు అనుకుంటున్నారు. రాష్ట్రం సాధించుకున్నమనే సంతోషం ప్రజల్లో లేకుండా పోయింది' అని బండి సంజయ్ పేర్కొన్నారు.

'కేసీఆర్.. నీ గుండె మీద చెయ్యి చేయి వేసుకొని ఆలోచించుకో.. నువ్వు చేసే పాలన కరెక్టేనా అని. అన్ని వర్గాలను సంతోష పెడుతున్నానా అని అనిపించిందా? నీ ఫాం హౌస్ లో ప్రొజెక్టర్ పెట్టుకొని చూసుకో. గతంలో ఏం చెప్పిన ఇప్పుడు ఏం చేస్తున్న అని తెల్సుకో' అని సంజయ్ విమర్శించారు.