
కరీంనగర్ : కేసీఆర్ ప్రభుత్వంలో పోలీసులు దారుణంగా వ్యవహారిస్తున్నారన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. డ్రైవర్ బాబు అంతిమయాత్ర తీస్తుండగా..పోలీసులు ఆయనపై చేయి చేసుకోవడంతో సీరియస్ అయ్యారు. శాంతియుతంగా బాబు అంతిమయాత్ర చేస్తుండగా..పోలీసులు శవాన్ని ఎత్తుకెళ్లడం దారుణమన్నారు. ఎంపీపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.
పేద కార్మికుడు చనిపోతే పోలీసులు విధ్వంసం సృష్టించారని..లా అండ్ కాపాడాల్సిన పోలీసులు సీఎం ఆర్డర్ తోనే క్రూరంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. పండుగలు లేవు పబ్బలులేని కార్మికుల ఉసురు కేసీఆర్ కు తగులుతుందన్నారు. ఎంపీని కాలర్ పట్టుకొని కొడుతరా అని సీరియస్ అయ్యారు బండి సంజయ్.