టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, సీఎం కేసీఆర్ నియంతృత్వ వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేకే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటని, ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. 

సీఎం కేసీఆర్ పాలనను, టీఆర్ఎస్ నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడటం వారి అవివేకానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు దాడులకు భయపడే ప్రస్తక్తేలేదని లేదని, ప్రజాసమస్యలపై నిలదీస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

జగిత్యాల జిల్లా వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను స్థానికులు అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండిలో TRS కార్యకర్తలు MP కారును ధ్వంసం చేశారు.