ఎన్నికలప్పుడే కేసీఆర్ కు పీవీ గుర్తుకొస్తడు

ఎన్నికలప్పుడే కేసీఆర్ కు పీవీ గుర్తుకొస్తడు

పీవీ కుటుంబాన్ని రాజకీయాల కోసమే కేసీఆర్ వాడుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పీవీ నర్సింహారావు 101వ జయంతిని పురస్కరించుకొని ఆయన నివాళులు అర్పించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను కేసీఆర్ ఎన్ని దేశాల్లో జరిపించారని సంజయ్ ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టే పీవీ నరసింహారావు ఘాట్ కు కేసీఆర్ రాలేదని ఆరోపించారు. ఢిల్లీలో పీవీ ఘాట్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పీవీని అవమానించిందని.. టీఆర్ఎస్ పార్టీ కూడా అవమానిస్తునే ఉందని అన్నారు. పీవీ నరసింహారావు స్వగ్రామం వంగర గ్రామంలో  అభివృద్ధి ఏమైందని అడిగారు.

ఎన్నికలు వస్తాయనగానే కేసీఆర్ కు పీవీ నరసింహారావు గుర్తుకొస్తాడని బండి సంజయ్ విమర్శించారు. గాంధీ యేతర కుటుంబం నుండి పీవీ ప్రధాని అయ్యాడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ పీవీని  గౌరవించలేదన్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా వున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగిందన్నారు. పేద ప్రజల గురించి అనునిత్యం ఆలోచించే వ్యక్తి పీవీ నరసింహారావు అని కొనియాడారు.