Bandi sanjay: బీజేపీ  ప్రభుత్వం వస్తే  ఏ స్కీమ్ ఆగదు : బండి సంజయ్

Bandi sanjay: బీజేపీ  ప్రభుత్వం వస్తే  ఏ స్కీమ్ ఆగదు : బండి సంజయ్

దమ్ముంటే ఎంఐఎం ఆదిలాబాద్ లో పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఆదిలాబాద్ గడ్డ మీద కాషాయం జెండా ఎగురుతుందన్నారు. 12 శాతం మైనార్టీలు ఉన్న బీహార్ లో ఎంఐఎం గెలిచింది ఐదు స్థానాలేనని అన్నారు.  బీజేపీ కేసులకు భయపడే పార్టీ  కాదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీనే అన్నారు. నయా రజాకార్ల పాలనను తరిమికొట్టాలంటే..అన్నివర్గాలు బీజేపీకి మద్దతు తెలపాలన్నారు.  ఎన్నికలెప్పుడొచ్చినా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

పేదలకు ఇండ్లు లేవు కానీ కేసీఆర్ కు వంద రూంలా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ వంద కోట్లతో దొంగసార దందా చేసిందని ఆరోపించారు. బయట రాష్ట్రాలకు వెళ్తే కవిత లిక్కర్ స్కాం దందా చూసి నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో  జీతాలివ్వడానికి  పైసలు లేవు కానీ.. కేసీఆర్ కుటుంబం విదేశాల్లో వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందని ఆరోపించారు. కేసీఆర్ ఒక్కొక్కరి పేరు మీద లక్షా 20 వేల అప్పు చేసిండని విమర్శించారు. లిక్కర్ ఆదాయం 10 వేల కోట్ల నుండి 40 వేల కోట్లకు పెరిగిందని..ఈ ఆదాయంతోనే పథకాలు నడుస్తున్నాయన్నారు.   బీజేపీ  ప్రభుత్వం వస్తే  ఏ స్కీమ్ ఆగదని..అదనంగా కొత్త పథకాలు ప్రవేశ పెడుతామన్నారు.