వీఆర్ఏల ఆందోళన న్యాయబద్ధమైనది

వీఆర్ఏల ఆందోళన న్యాయబద్ధమైనది

వీఆర్ఏల ఆందోళన న్యాయబద్ధమైందని..వారికి తక్షణమే పే స్కేల్, ప్రమోషన్ ఇవ్వాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్   కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వీఆర్ఏలకు ఆయన మద్దతు ప్రకటించారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన దుర్మార్గుడు కేసీఆర్ అని విమర్శించారు. ఆందోళన చేస్తున్న వీఆర్ఏలను కాల్చిపారేస్తానన్న సీఐని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. కాల్చుకుంటూ పోతే కేసీఆర్, ఆయన కుటుంబం మినహా రాష్ట్రంలో ఏ ఒక్కరూ మిగలరని అని అన్నారు. 

వీఆర్ఏలకు అండగా బీజేపీ ఉంటుందని బండి సంజయ్  హామీ ఇచ్చారు. కేసులు, లాఠీ దెబ్బలకు భయపడకుండా ఉద్యోగుల పక్షాన పోరాడుతూ జైలు కెళ్లింది బీజేపీ నాయకులేనని చెప్పారు. పచ్చి అబద్దాలు,మోసపు హామీలతో కాలం గడుపుతున్న కేసీఆర్ ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని బండి సంజయ్ పరిష్కరించారు.