
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర శనివారంతో ముగియనుంది. ఈ సందర్భంగా బీజేపీ హనుమకొండలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసింది. బండి సంజయ్ చివరి రోజున బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజ్ నుండి పాదయాత్ర ప్రారంభించనున్నారు. మామునూర్, తిమ్మాపూర్ క్రాస్ రోడ్, నాయుడు పంప్, రంగశాయి పేట, ఖిలా వరంగల్ క్రాస్ రోడ్ మీదుగా బట్టల బజార్ కు చేరుకోనున్నారు. అనంతరం వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం వద్ద పాదయాత్ర ముగియనుంది.
సాయంత్రం భద్రకాళి అమ్మవారిని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో కలిసి బండి సంజయ్ దర్శించుకోనున్నారు. ఇక్కడి నుంచి నేరుగా హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీకి చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు.
- బండి సంజయ్ మొదటి విడత పాదయాత్ర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైంది. అక్టోబర్ 02వ తేదీన హుస్నాబాద్ లో పాదయాత్ర ముగిసింది.
- రెండో విడత పాదయాత్ర బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. మే 14న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ముగిసింది.
- మూడో విడత పాదయాత్ర యాదాద్రి నుంచి ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలోని హన్మకొండలో ముగియనుంది.