గండిపేట, వెలుగు: మాజీ మంత్రి హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ అనారోగ్యంతో మృతిచెందగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ బుధవారం మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోని హరీశ్‌రావు నివాసానికి వెళ్లి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.
