బ్రిటీష్ వాళ్ల వల్లే కాలేదు.. నీ వల్ల ఏం అవుతుంది

బ్రిటీష్ వాళ్ల వల్లే కాలేదు.. నీ వల్ల ఏం అవుతుంది

హిందువుల మనోభావాలు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతీసారీ హిందూ పండగలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. పటాకుల నిషేధం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో బలంగా వాదించకపోవడం వల్లే కోర్ట్ నిషేధం విధించిందని ఆయన అన్నారు.

For More News..

* తెలంగాణలో పటాకులు కాల్చివేతపై నిషేధం ఎత్తివేత

* నా బాత్రూంలో కెమెరాలు పెట్టారు

* నవంబర్ 15న శబరిమల ఆలయం ఓపెన్.. దర్శనానికి నిబంధనలివే..

‘ప్రతీసారీ హిందువుల పండగలను వివాదాస్పదం చెయ్యడం ఫ్యాషన్ అయిపోయింది. దీపావళి పటాకుల షాపులకు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి.. ఇప్పుడు బంద్ చెయ్యమంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లనే చిరు వ్యాపారులు నష్టపోతున్నారు. పెద్ద మొత్తంలో పటాకుల నిల్వల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పటాకుల నిషేధం వల్ల నష్టపోతున్న చిరు వ్యాపారులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి. పండగపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. హిందుత్వాన్ని అణచివేయాలని చూసిన మొగలులు, నిజాం పాలకులు కాలగర్భంలో కలిసిపోయారు.. మీరు కూడా అంతే. న్యూ ఇయర్ వేడుకల్లో 192 దేశాల్లో పటాకులు కాల్చితే రాని కాలుష్యం.. దీపావళి ఒక్కరోజు కాల్చడం వల్ల వస్తుందా? హిందువుల పండగలను ఆపడం 200 ఏళ్ళు ఏలిన బ్రిటీష్ వాళ్ళ వల్లే కాలేదు.. ఇంకా నీవల్ల ఏం అవుతుంది. అంతిమ విజయం ధర్మానిదే. హిందువుల పండుగలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు’ అని ఆయన అన్నారు.