ఈటలకు బండిసంజయ్, వివేక్ వెంకటస్వామి పరామర్శ

V6 Velugu Posted on Jul 31, 2021

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. బీపీ కంట్రోల్ లోనే ఉండగా, షుగర్ లెవల్స్ అప్ డౌన్ అవుతున్నాయి. నిన్న రాత్రి చేసిన కోవిడ్ ర్యాపిడ్ టెస్టులో నెగటివ్ వచ్చింది. హాస్పిటల్ లో ఈటలను పరామర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. 

ప్రజా దీవెన పేరుతో పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్ వీణవంక మండలం కొండపాకలో మాట్లాడిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వీణవంక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. కాళ్లకు పొక్కులు వచ్చాయని వెంటనే హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే మొదట ఈటల అందుకు అంగీకరించలేదు. బస్ లోనే బీపీ, షుగర్ లెవల్స్ చెక్ చేసి సెలైన్ ఎక్కించారు. ఇవాళ మెరుగైన చికిత్స కోసం ఈటలను జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు తీసుకొచ్చారు ఆయన కుటుంబ సభ్యులు. 

Tagged Vivek Venkataswamy, Eatala Rajender, hospital, #BandiSanjay

Latest Videos

Subscribe Now

More News