ఎమ్మెల్యే సీతక్క కథతో.. బండ్లన్న సినిమా

ఎమ్మెల్యే సీతక్క కథతో.. బండ్లన్న సినిమా

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్(Bandla ganesh) నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాడు. ఆయన తీసిన సినిమాల కంటే.. కాంట్రావర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలవడం ఆయనకు అలవాటే. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న బండ్ల గణేష్.. రాజకీయాలపై తనదైన స్టైల్లో ట్వీట్స్ సంధిస్తూ ఉంటారు.

ఇక తాజాగా మరోసారి అలాంటి సంచలనమైన ట్వీట్ వేశారు బండ్ల గణేష్. అదేంటంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(Seethakka) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు చాలామందే ఫాలోవర్స్ ఉన్నారు. తనను నమ్ముకొని గెలిపించిన ప్రజలకు సేవచేయాలనే సంకల్పంతోనే ఉంటారు ఆమె. అయితే తాజాగా సీతక్క పుట్టినరోజు సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు బండ్ల గణేష్.

"నమ్ముకున్న ప్రజల కోసం.. అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఒక అభిమాని స్పందిస్తూ.. అడవిలో అన్న, లీడర్ సినిమాలి కలిపితే నిజ జీవితంలో సీతక్క సినిమా అవుతుంది మీరు తెప్పకుండా తీయాలన్నా అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కు స్పందించిన బండ్ల గణేష్.. అద్భుతమైన సలహా తమ్ముడు.. తప్పకుండ ఆలోచిస్తా అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.