ప్రతీదాంట్లో వేలు పెడ్తవ్.? .. ప్రకాశ్ రాజ్‌పై విరుచుకుపడ్డ బండ్ల గణేశ్

ప్రతీదాంట్లో వేలు పెడ్తవ్.? .. ప్రకాశ్ రాజ్‌పై విరుచుకుపడ్డ బండ్ల గణేశ్

 సినీ నటుడు ప్రకాశ్ రాజ్ టార్గెట్‌గా.. వివాదాస్పద నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఎక్స్ వేదికగా ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి అత్యంత తీవ్ర పదజాలంతో బండ్ల గణేశ్ చేసిన ట్వీట్  టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ  సంచలనంగా మారింది.

ఒరేయ్… నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? అంటూ బండ్ల గణేశ్ ట్విట్టర్ వేదికగా ప్రకాశ్ రాజ్‌పై ఒక రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే కనిపిస్తావని.. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వద్దంటూ తీవ్రంగా హెచ్చరించారు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్ అంటూ బండ్ల గణేశ్ వేసిన పంచ్‌లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అసలింతకీ వీరిద్దరి మధ్య ఇంతటి రచ్చ జరగడానికి కారణం ఏంటంటే.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తన శైలిలో తన ఎక్స్ లో  సెటైర్లు వేశారు.

మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర .. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి" అంటూ ఎక్స్ వేదికగా ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ చేసిన ఈ ట్వీట్.. పవన్ వీరాభిమాని అయిన బండ్ల గణేశ్‌ప్రకాశ్ రాజ్‌కు గట్టి కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేసేశారు.