మీ పుట్టుకే ఒక అద్భుతం.. హ్యాపీ బర్త్‌డే మై బాస్: బండ్ల గణేష్

మీ పుట్టుకే ఒక అద్భుతం.. హ్యాపీ బర్త్‌డే మై బాస్: బండ్ల గణేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఇవాళ (సెప్టెంబర్ 2). నేటితో పవన్ 54వ వసంతంలోకి (2 September 1971) అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఎంతోమంది తమ మాటలతో అభిమానాన్ని చాటుతూ వస్తున్నారు. ట్వీట్స్ పెడుతూ పవన్కు విషెస్ చెబుతున్నారు. అయితే, పవన్ ఫ్యాన్స్ మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ పర్సన్ చెప్పే విషెష్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే, అందరూ ఇచ్చే స్పీచ్లా ఉండదు.. అతనిది. అందరూ పెట్టె ట్వీట్లా ఉండదు ఈ ఒక్కడిది.!. అతనే నటుడు, నిర్మాత బండ్ల గణేష్. 

ఈ వర్సటైల్ పర్సన్కు.. పవన్ కళ్యాణ్ అంటే దేవుడు.. అంతేకాదు తన గుండెకాయ కూడా. ఈ మాట చాలా సందర్భాల్లో బండ్ల గణేష్ తన స్పీచ్ ద్వారా చెప్పుకొచ్చారు. మరి ఇవాళ బండ్ల గణేష్ తన ఆరాధ్య దైవమైన పవన్కు, ఎలాంటి విషెస్ అందించాడనే ఆసక్తి పవన్ ఫ్యాన్స్లో నెలకొంది. మరి బండ్లన్న ట్వీట్ చూసేద్దాం ఒకసారి. 

చరిత్రలో ఓకే ఒక్కడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. “కోట్ల మంది గుండెల్లో ఆశాజ్యోతిగా మారిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీ పుట్టుకే ఒక అద్భుతం. హ్యాపీ బర్త్‌డే మై బాస్. మీరు నిండునూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా, మహోన్నతంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ప్రేమతో మీ బండ్ల గణేష్” అని తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

ఇపుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదేమైనా, బండ్ల ఏది చేసినా సంచలనమే. అది సినిమా అయినా, రాజకీయమైనా.. ఆయన మాట్లాడే మాటలు, చేసే కామెంట్స్ దెబ్బకి ట్రేండింగ్ లోకి రావాల్సిందే. అది సోషల్ మీడియాలో ఆయనకున్న క్రేజ్. ఇకపోతే, బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘తీన్ మార్’ మరియు ‘గబ్బర్ సింగ్’ చిత్రాలను నిర్మించారు.