అయ్యప్ప మాలలో ఉండి చెప్పులు వేసుకున్న బండ్ల గణేష్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్

అయ్యప్ప మాలలో ఉండి చెప్పులు వేసుకున్న బండ్ల గణేష్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్(Bandla Ganesh) నిత్యం ఎదో ఒక ఇష్యూతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. ఆయన మాట్లాడే మాటలు, చేసే పనులకు నెటిజన్స్ ఆయన్ని ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. తాజాగా అలాంటి పనే ఒకటి చేసి మరోసారి నెటిజన్స్ కంట్లో పడ్డారు. దీంతో ఆయనపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బండ్ల గణేష్ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంధులు భాగంగానే ప్రతీ సంవత్సరం పెద్దఎత్తున బాణాసంచా తెప్పించి ఊరంతా పంచుతారు. ఈ సంవత్సరం కూడా అలాగే చేశారు బండ్ల గణేష్. అందరితో సందడిగా గడిపారు. అయితే ఈ సంవత్సరం బండ్ల గణేష్ అయ్యప్ప మాలలో ఉన్నారు. 

అయితే అయ్యప్ప మాలలో ఉన్న బండ్ల గణేష్ చెప్పులు ధరించి క్రాకర్స్ కాల్చుతూ కనిపించారు. దీనికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ ఫోటో చూసిన నెటిజన్స్ బండ్ల గణేష్ పై మండిపడుతున్నారు. అయ్యప్ప మాల చాలా పవిత్రమైనది. దాన్ని ఇలా చేసి అపవిత్రం చేయకండి.. మాలాధారణలో ఉంది ఇలా చేయడం తప్పు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పై బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారు చూడాలి.    

ALSO READ : లేట్గా వచ్చినా సాలిడ్ రికార్డ్ కొట్టేసింది.. అది విక్రమ్ రేంజ్