బండ్లగూడ డిపో ఆర్టీసీ మహిళా కండక్టర్ సూసైడ్

బండ్లగూడ డిపో  ఆర్టీసీ మహిళా కండక్టర్ సూసైడ్
  • అధికారుల వేధింపులే కారణమన్న ఈయూ 

హైదరాబాద్, వెలుగు : స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగి ఓ మహిళా కండక్టర్ సూసైడ్ చేసుకుంది. బండ్లగూడ డిపోకు చెందిన శ్రీవిద్య రెండ్రోజుల కిందట స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగేసింది. గమనించిన కుటుంబసభ్యులు హాస్పిటల్​కు తరలించారు. అక్కడ ట్రీట్​మెంట్​ పొందుతూ సోమవారం శ్రీవిద్య చనిపోయింది. మహిళా కండక్టర్ మృతిపై  ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..ఆర్టీసీ అధికారుల వేధింపుల వల్లే శ్రీవిద్య సూసైడ్ చేసుకున్నదని ఆరోపించారు.

కార్మికులపై అధికారులు వేధింపులు ఆపాలని లేకుంటే తిరుగుబాటు తప్పదని రాజిరెడ్డి హెచ్చరించారు. బండ్లగూడ డిపో పరిధిలోని హై టెన్షన్ లైన్ కారణంగా బస్టాప్ మార్చారని, డ్యూటీలో భాగంగా ఓ కాలనీకి బస్  వెళ్లకపోవటంతో డ్రైవర్, కండక్టర్ ను అధికారులు మందలించారని ఆయన తెలిపారు. దాంతో  మహిళా కండక్టర్ సూసైడ్ చేసుకుందని చెప్పారు. ఘటనపై ఎండీ జోక్యం చేసుకొని విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.