షాపింగ్ మాల్లో కాల్పులు.. ముగ్గురు మృతి

 షాపింగ్ మాల్లో  కాల్పులు.. ముగ్గురు మృతి

బ్యాంకాక్ లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలుడు..విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో  ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. 

అక్టోబర్ 3 మంగళవారం  బ్యాంకాక్ లోని  సియామ్ పారగాన్ షాపింగ్ మాల్ లో ఒక 14 ఏళ్ల బాలుడు పిస్టల్ తో  విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో  ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల తర్వాత ఆ బాలుడు పోలీసులకు లొంగిపోయాడు. అయితే బాలుడు ఎందుకు కాల్పులు జరిపాడన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

అక్టోబర్ 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం ప్రజలంతా షాపింగ్ చేసేందుకు  సియామ్ పారగాన్ షాపింగ్ మాల్ కు వచ్చారు. అయితే ఒక్కసారిగా మాల్ లో  తుపాకీ కాల్పుల చప్పుడు వినిపించింది. దీంతో అక్కడి జనం  భయంతో  బయటకు పరుగులు తీశారు. మాల్ లో నుంచి ప్రజలు భయంతో ప్రజలు పరిగెత్తుకు వస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

మరోవైపు కాల్పులకు పాల్పడిన 14 ఏండ్ల  బాలుడు బ్లాక్ టీ షర్ట్ ధరించి, బేస్ బాల్ క్యాప్ పెట్టుకుని ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ క్యాప్ పై యూఎస్ ఫ్లాగ్ ప్రింటై ఉందని చెప్పారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటన తర్వాత  మాల్ ను తాత్కాలికంగా మూసివేశారు.