ఇండోర్ టెస్ట్ : 150కే బంగ్లా ఆలౌట్

ఇండోర్ టెస్ట్ : 150కే బంగ్లా ఆలౌట్

ఇండోర్: బంగ్లాదేశ్, భారత్ మధ్యన ఇండోర్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్టులో తక్కవ స్కోర్ కే ఆల్ ఔట్ అయ్యింది బంగ్లాదేశ్. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లా..58.3 ఓవర్లలో 150 రన్స్ కే కుప్పకూలింది. బంగ్లా బ్యాట్స్‌ మెన్లలో ముష్ఫికుర్ రహీం (43), కెప్టెన్ మొమినుల్ హక్ (37)లు మాత్రమే కొంత సేపు క్రీజులో నిలదొక్కుకున్నారు.

మిగతా ప్లేయర్లందరు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌ లు తలో 2 వికెట్లు తీశారు.