
దుబాయ్: సైఫ్ హసన్ (45 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 61), తౌహిద్ హృదయ్ (37 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 58) మెరుపు బ్యాటింగ్‌తో ఆసియా కప్‌లో బలమైన శ్రీలంకకు బంగ్లాదేశ్ షాకిచ్చింది. శనివారం జరిగిన సూపర్--4 రౌండ్ తొలి పోరులో 4 వికెట్ల తేడాతో లంకను ఓడించింది.
ఈ ఉత్కంఠ పోరులో తొలుత లంక 20 ఓవర్లలో 168/7 స్కోరు చేసింది. దసున్ షనక (37 బాల్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 64 నాటౌట్) ఫిఫ్టీతో సత్తా చాటాడు. కుశాల్ మెండిస్ (34), పాథుమ్ నిశాంక (22), చరిత్ అసలంక(21) ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రహమాన్ (3/20), మెహిదీ హసన్ (2/25) రాణించారు. ఛేజింగ్‌లో బంగ్లా 19.5 ఓవర్లలో 169/6 స్కోరు చేసి గెలిచింది. కెప్టెన్ లిటన్ దాస్ (23) కూడా ఆకట్టుకున్నాడు. సైఫ్ హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లా ఇండియాతో తలపడనుంది.