ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మ్యాచులో భారత బౌలర్స్ దుమ్మురేపారు. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచులో భారత బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. రాధా యాదవ్ 3 వికెట్లతో సత్తాచాటడంతో బంగ్లా నిర్ణీత 27 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. షర్మిన్ అక్తర్ (37), శోభన మోస్తరీ (26) తప్ప మిగిలిన బ్యాటర్లంతా విఫలం అయ్యారు. శ్రీచరణి, రేణుకా సింగ్, దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ పడగొట్టారు.
నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది. భారత్ బౌలర్లు విజృంభించడంతో 30 పరుగులకే బంగ్లా రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వర్షం పడటంతో మ్యాచ్ నిలిచిపోయింది.
వర్షం చాలా సేపు కురవడంతో మ్యాచ్ అఫిషియల్స్ 27 ఓవర్లకు ఆటను కుదించారు. వర్షం తగ్గాక ఆట ప్రారంభించిన బంగ్లా ఏ దశలోనూ భారత్‌కు పోటీ ఇవ్వలేదు. షర్మిన్ అక్తర్ (37), శోభన మోస్టరీ (26) తప్ప మిగిలిన బ్యాటర్లంతా విఫలం అయ్యారు. భారత బౌలర్లు నిప్పులు చెరగడంతో బంగ్లాలో ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు. దీన్నే బట్టే బంగ్లా బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.
