క్రికెట్ చరిత్రలో చెత్త రివ్యూ..వీడియో వైరల్

క్రికెట్ చరిత్రలో చెత్త రివ్యూ..వీడియో వైరల్

క్రికెట్లో డీఆర్‌ఎస్‌ అంటే డిసిషన్ రివ్యూ సిస్టమ్. అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ సమీక్షించే వ్యవస్థ అని అర్థం. అంపైర్ నుంచి అనుకూలమైన నిర్ణయం రానప్పుడు ఆటగాళ్లు అంపైర్ నిర్ణయంపై సమీక్ష కోరవచ్చు.  దీనిపై ఆటగాళ్లకు స్పష్టమైన అవగాహన ఉండాలి. అయితే  సొంతగడ్డపై ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో బంగ్లా కెప్టెన్ తీసుకున్న డీఆర్ఎస్ నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 

చెత్త రివ్యూ..

రెండో వన్డేలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో 48వ ఓవర్ను  టస్కిన్ మహ్మద్ వేశాడు. చివరి బంతిని యార్కర్గా వేయడంతో ఆదిల్ రషీద్ డిఫెన్స్ చేశాడు. బంతి బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ సమయంలో బౌలర్ టస్కిన్ అహ్మద్ ఔటివ్వాలని అంపైర్ ను కోరాడు. అంపైర్ ఔటివ్వకపోవడంతో  రివ్యూ కోరాలని కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు సూచించాడు. దీంతో తమీమ్  సమీక్ష కోరగా.... రిప్లేలో అసలు బాల్ ప్యాడ్‌కే తాకలేదు. స్పష్టంగా బంతి బ్యాట్‌కు తాకినట్లు కనిపించింది. దీంతో ఈ రివ్యూ ఎందుకు తీసుకున్నారో అటు బ్యాట్స్మన్, ఇటు అంపైర్కు అర్థం కాలేదు.  క్రికెట్ చరిత్రలోనే ఇదో అత్యంత చెత్త రివ్యూ అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. 

బంగ్లా ఓటమి..

రెండో వన్డేలో ఇంగ్లాండ్  112 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 326 పరుగులు చేసింది. జేసన్ రాయ్ 124 బంతుల్లో 18 ఫోర్లు, సిక్స్‌తో 132 పరుగులు చేశాడు.  కెప్టెన్ జోస్ బట్లర్ 64 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 రన్స్ సాధించాడు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 3 వికెట్లు దక్కించుకోగా..మెహ్‌దీ హసన్ మీరాజ్ 2  వికెట్లు సాధించాడు. షకీబ్, తైజుల్‌కు చెరో వికెట్ దక్కింది. ఆ తర్వాత 327 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 194 పరుగులకే ఆలౌట్ అయింది.   షకీబ్ అల్ హసన్ 69 బంతుల్లో 5 ఫోర్లతో 58 హాఫ్ సెంచరీ సాధించాడు. సామ్ కరన్, ఆదిల్ రషీద్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. మొయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది. బంగ్లా బ్యాటర్లలో షకీబ్ అల్ హసన్(69 బంతుల్లో 5 ఫోర్లతో 58) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ  విజయంతో  మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్  2-0తో దక్కించుకుంది.