బంగ్లాలో మళ్లీ హింస.. హిందువుల ఇండ్లకు నిప్పు

బంగ్లాలో మళ్లీ హింస.. హిందువుల ఇండ్లకు నిప్పు

ఢాకా: బంగ్లాదేశ్​లో గత వారం దుర్గా పూజ సందర్భంగా హిందువులపై మొదలైన హింసాకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆదివారం రాత్రి రంగాపూర్ జిల్లాలో కనీసం 29 మంది హిందువుల ఇండ్లకు దుండగులు నిప్పు పెట్టారు. దాంతో పోలీసులతో పాటు కనీసం 40 మంది గాయపడ్డారు. హిందువులపై దాడులకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా దేశంలో క్రమంగా ఊపందుకుంటున్నాయి. తాజాగా ఢాకా వర్సిటీ స్టూడెంట్లు కూడా ఈ ఆందోళనలకు మద్దతు పలికారు. మైనారిటీల భద్రత, హక్కుల రక్షణకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు హిందూ ఆలయాలు, దుకాణాలను దోచుకున్న కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అల్లర్ల వ్యాప్తిని ఆపడానికి పలుచోట్ల ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. ప్రధాని షేక్ హసీనా హిందూ నేతలతో సమావేశమై, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.