
చట్టోగ్రామ్: మెహిదీ హసన్ మిరాజ్ (102, 5/32) ఆల్‌రౌండ్ షోతో చెలరేగడంతో.. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 106 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో డ్రా చేసుకుంది. 291/7 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం మూడో రోజు ఆట కొనసాగించిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 129.2 ఓవర్లలో 444 రన్స్‌కు ఆలౌటైంది.
ౌతన్జిమ్ హసన్ షకీబ్ (41) రాణించాడు. విన్సెంట్ మసకెస 5 వికెట్లు తీశాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 46.2 ఓవర్లలో 111 రన్స్‌కు ఆలౌటైంది. బెన్ కరన్ (46) టాప్ స్కోరర్. క్రెయిగ్ ఇర్విన్ (25), మసకద్జా (10) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. బంగ్లా బౌలర్ల ధాటికి ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. తైజుల్ ఇస్లామ్ 3, నయీమ్ హసన్ ఒక వికెట్ పడగొట్టారు. మెహిదీ హసన్ మిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.