ఆర్మీ ఆఫీసర్లను జైలుకు పంపిన బంగ్లా సర్కారు

ఆర్మీ ఆఫీసర్లను జైలుకు పంపిన బంగ్లా సర్కారు

ఢాకా: బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ–బీడీ)15 మంది ఆర్మీ ఆఫీసర్లను బుధవారం జైలుకు పంపించింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యలు, కస్టడీలో హింసలకు సంబంధించిన కేసులో ఈ సైనికాధికారులు విచారణను ఎదుర్కొన్నారు. 

స్పెషల్ ట్రిబ్యునల్ ఆదేశాలతో వీరిని బంగ్లాదేశ్ ఆర్మీ అక్టోబర్ 11న కస్టడీలోకి తీసుకుంది. బుధవారం కోర్టులో ప్రవేశపెట్టగా వీరిని జైలుకు పంపాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 5న జరుగుతుందని అంతకు ముందే బెయిల్ పిటిషన్లకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చని పేర్కొంది. 

పరారీలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు ఇతర నిందితులను కోర్టు మందు హాజరపర్చాలని ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది.