ODI World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లాదేశ్.. పాక్‌ జట్టులో భారీ మార్పులు

ODI World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లాదేశ్.. పాక్‌ జట్టులో భారీ మార్పులు

వరల్డ్ కప్ లో భాగంగా నేడు పాకిస్థాన్ తో బంగ్లాదేశ్ తలపడనుంది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. వరుసగా నాలుగు  మ్యాచ్ ల్లో ఓడి పాక్ బరిలోకి దిగుతుండగా.. బంగ్లాదేశ్ అంతకుమించి వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడింది. ఇప్పటికే బంగ్లా అధికారికంగా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించగా.. పాక్ కు మాత్రం ఇదే చివరి అవకాశం. ఇక ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. పాక్ జట్టు మూడు మార్పులతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతుంది.     

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):

అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్

బంగ్లాదేశ్  (ప్లేయింగ్ XI): 

లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం