శ్రీలంకతో తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ 511

శ్రీలంకతో తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ 511
  •     ప్రస్తుతం 47/5

సిల్హెట్‌‌‌‌‌‌‌‌: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ ఓటమి దిశగా పయనిస్తోంది. లంక నిర్దేశించిన 511 రన్స్‌‌‌‌‌‌‌‌ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆదివారం మూడో రోజు బరిలోకి దిగిన బంగ్లా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 13 ఓవర్లలో 47/5 స్కోరు చేసింది. మోమినల్‌‌‌‌‌‌‌‌ హక్‌‌‌‌‌‌‌‌ (7*), తైజుల్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌ (6*) క్రీజులో ఉన్నారు. జాకీర్‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌ (19), హసన్‌‌‌‌‌‌‌‌ జాయ్‌‌‌‌‌‌‌‌ (0), నజ్ముల్‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌ (6), షహదత్‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌ (0), లిటన్‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌ (0) ఫెయిలయ్యారు. విశ్వా ఫెర్నాండో 3 వికెట్లు తీశాడు. 

బంగ్లా విజయానికి ఇంకా 464 రన్స్‌‌‌‌‌‌‌‌ కావాలి. అంతకుముందు 119/5 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 110.4 ఓవర్లలో 418 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ధనంజయ డిసిల్వా (108), కమింద్‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌ (164) సెంచరీలతో చెలరేగారు. ప్రభాత్‌‌‌‌‌‌‌‌ జయసూరియా (25) ఫర్వాలేదనిపించాడు. మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌ 4, నాహిద్‌‌‌‌‌‌‌‌ రాణా, తైజుల్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు.