Asia Cup 2025: వరుసగా రెండు రోజులు మ్యాచ్‌లు.. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌కు అన్యాయం

Asia Cup 2025: వరుసగా రెండు రోజులు మ్యాచ్‌లు.. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌కు అన్యాయం

ఆసియా కప్ లో శనివారం (సెప్టెంబర్ 20) నుంచి సూపర్-4 రౌండ్ ప్రారంభమైంది. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4లో ఒక మ్యాచ్ ఆడేశాయి. ఈ కాంటినెంటల్ టోర్నీలో గ్రూప్-ఏ నుంచి ఇండియా, పాకిస్థాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 కు అర్హత సాధించగా.. షెడ్యూల్ లో బంగ్లాదేశ్ కు అన్యాయం జరిగింది. శుక్రవారం (సెప్టెంబర్ 19) ఇండియా, ఒమాన్ మ్యాచ్ తో లీగ్ మ్యాచ్ లు ముగిసిన వెంటనే ఒక్క రోజు గ్యాప్ కూడా లేకుండా అంటే శనివారం (సెప్టెంబర్ 20) నుంచి సూపర్-4 రౌండ్ స్టార్ట్ చేశారు. 

టోర్నీ షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ లో గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 లో తొలి మ్యాచ్ ఆడితే బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆదివారం (సెప్టెంబర్ 21)  జరిగిన మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. సోమవారం నాలుగు జట్లకు రెస్ట్ ఇవ్వడంతో ఈ రోజు ఎలాంటి మ్యాచ్ లు ఉండవు. మంగళవారం (సెప్టెంబర్ 23) పాకిస్థాన్ తో శ్రీలంక.. బుధవారం (సెప్టెంబర్ 24) ఇండియా, బంగ్లాదేశ్.. గురువారం (సెప్టెంబర్ 25) బంగ్లాదేశ్ తో పాకిస్థాన్.. శుక్రవారం (సెప్టెంబర్ 26) ఇండియా, శ్రీలంక మ్యాచ్ లు ఉంటాయి.

షెడ్యూల్ గమనిస్తే బంగ్లాదేశ్ వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్ లు ఆడాలి. బుధవారం (సెప్టెంబర్ 24) ఇండియాతో.. ఆ తర్వాత ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా గురువారం (సెప్టెంబర్ 25) పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడనుంది. మూడు జట్లకు మ్యాచ్ ల మధ్యలో కనీసం ఒక రోజైనా గ్యాప్ ఉంది. కానీ బంగ్లాదేశ్ కు మాత్రం సూపర్-4లో ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్ లను రెండు రోజుల్లో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ షెడ్యూల్ బంగ్లా విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.  

ఆసియా కప్ 2025 - సూపర్-4 షెడ్యూల్:

సెప్టెంబర్ 20: శ్రీలంక vs బంగ్లాదేశ్ - దుబాయ్ - 8:00pm
 
సెప్టెంబర్ 21: భారత్ vs పాకిస్థాన్ - దుబాయ్ - రాత్రి 8:00 

సెప్టెంబర్ 23: పాకిస్థాన్ vs శ్రీలంక - అబుదాబి - రాత్రి 8:00
 
సెప్టెంబర్ 24: భారతదేశం vs బంగ్లాదేశ్ - దుబాయ్ - 8:00pm 

సెప్టెంబర్ 25: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ - దుబాయ్ - రాత్రి 8:00 IST

సెప్టెంబర్ 26: భారత్ vs శ్రీలంక - దుబాయ్ - రాత్రి 8:00
 
సెప్టెంబర్ 28: ఫైనల్ -  దుబాయ్ - రాత్రి 8:00