Asia Cup 2025: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. సంచలనం కోసం హాంకాంగ్ ఆరాటం

Asia Cup 2025: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. సంచలనం కోసం హాంకాంగ్ ఆరాటం

ఆసియా  కప్ లో మరో ఆసక్తికర సమరం మొదలయింది. గురువారం (సెప్టెంబర్ 11) బంగ్లాదేశ్, హాంకాంగ్ తో బంగ్లాదేశ్ టోర్నీలో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టాలని బంగ్లాదేశ్ భావిస్తుంటే మరోవైపు హాంకాంగ్.. బంగ్లాకు షాక్ ఇవ్వాలని చూస్తోంది . టోర్నీ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడిన హాంకాంగ్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు ఒకటే మ్యాచ్ జరిగితే ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది.