సముద్రంలో పెరిగిన అలల ఉధృతి.. విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌక (వీడియో)

సముద్రంలో పెరిగిన అలల ఉధృతి.. విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌక (వీడియో)

విశాఖ: బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటడంతో సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన అల్పపీడనం ప్రభావంతో  పశ్చిమ మధ్య బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి గంటకు 50-60, అప్పుడప్పుడు 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. అలల ఉదృతి వల్ల విశాఖ పట్టణం తీరానికి బంగ్లాదేశ్ నౌక కొట్టుకుని వచ్చింది. ఔటర్ హార్బర్ లో యాంకరేజ్ తెగి ఒడ్డుకొచ్చిన కార్గోషిప్.. తీరానికి కొద్దిదూరంలో ఇసుకలో చిక్కుకుంది. ఈ కార్గో షిప్ లో 15 మంది సిబ్బంది ఉన్నారు. నిన్న రాత్రి ఘటన జరిగిన వెంటనే మెరైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. విశాఖ పోర్ట్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొని ఓడను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలలు ఉధృతంగా ఉండడంతో తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.