నాకు డబ్బు కాదు.. దేశం ముఖ్యం.. IPLకు షాక్ ఇచ్చిన స్టార్ క్రికెటర్

నాకు డబ్బు కాదు.. దేశం ముఖ్యం.. IPLకు షాక్ ఇచ్చిన స్టార్ క్రికెటర్

బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఐపీఎల్ 2024 నుంచి వైదొలిగాడు. డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనున్న IPL 2024 మినీ-వేలం కోసం షకీబ్  తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ తరపున ప్రాతినిధిహ్యం వహిస్తున్న ఈ స్టార్ ఆల్ రౌండర్.. ఆ జట్టు రెటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది. దీంతో షకీబ్ వేలంలోకి వస్తాడనుకున్నా ఐపీఎల్ ఆడట్లేదని షాకిచ్చాడు. ఫ్రాంచైజీ లీగ్ లకన్నా ఐపీఎల్ తనకు ముఖ్యమని షకీబ్ తెలిపాడు. 

"నేను ఐపిఎల్‌ ఆడేందుకు సిద్ధంగా లేను. పాకిస్థాన్ క్రికెట్ లీగ్ లో నా పేరు ఇచ్చినప్పటికే ఉపసంహరించుకున్నాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. జాతీయ జట్టుకు ఎక్కువ కాలం ఆడాలనే కోరిక నాలో ఉంది. మూడు ఫార్మాట్ లో కొనసాగాలని భావిస్తున్నా".అని షకీబ్ USAలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో చెప్పాడు. ఐపీఎల్ 2023లో షకీబ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. 

భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో వేలి గాయంతో షకీబ్ తన చివరి మ్యాచ్ ఆడలేదు. ఈ క్రమంలో న్యూజిలాండ్ తో జరిగిన  రెండు టెస్టుల సిరీస్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న ఈ స్టార్ ఆల్ రౌండర్ జాతీయ జట్టుపై ఎక్కువ దృష్టి పెట్టేందుకు ప్రపంచ లీగ్ లను త్యాగం చేస్తానని చెప్పుకొచ్చాడు. జనవరి 19 నుండి ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) సమయానికి కోలుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఈ నెల 19న దుబాయ్‌‌లో జరిగే వేలం కోసం రిజిస్టర్ అయిన 1166 మంది ప్లేయర్ల నుంచి ఫ్రాంచైజీలు ఆసక్తి చూసిన మొత్తం 333 మంది క్రికెటర్లను ఐపీఎల్‌‌ గవర్నింగ్ కౌన్సిల్ సోమవారం షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 214 మంది ఇండియన్స్, 119 మంది ఫారిన్ ప్లేయర్లు, ఇద్దరు అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు.