- ముగ్గురు నిందితులపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు
జూబ్లీహిల్స్, వెలుగు: పంట ఒప్పందంతో భూమిపై కన్నేసిన ముగ్గురిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌కు చెందిన సెడింబి మధుసూధన్ రావుకు 2021లో దశరథ్ రామ్ బీగల అనే వ్యక్తి న్యాయ సలహాదారుడిగా పరిచయమయ్యాడు. అనంతరం 2023లో తన అనుచరులు లక్ష్మీ నారాయణ, ప్రసాద్‌తో కలిసి మధుసూధన్ రావు భూమిలోని పంటను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
అయితే, పంటకు సంబంధించిన పూర్తి డబ్బులు చెల్లించకుండా తప్పించుకున్న నిందితులు.. 2026 జనవరిలో అసలు రంగు బయటపెట్టారు. తాము భూమి కొనుగోలుకే అగ్రిమెంట్ చేసుకున్నామంటూ నకిలీ పత్రాలు సృష్టించి, బాధితుడికి కోర్టు నోటీసులు పంపడమే కాకుండా బెదిరింపులకు దిగారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దశరథ్ రామ్, లక్ష్మీనారాయణ, ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
