హైదరాబాద్‌ లో కొరియర్ డెలివరీ పేరుతో చీటింగ్..రూ.2.49 లక్షలు కొట్టేసిన చీటర్లు

హైదరాబాద్‌ లో కొరియర్ డెలివరీ పేరుతో చీటింగ్..రూ.2.49 లక్షలు కొట్టేసిన చీటర్లు

బషీర్​బాగ్, వెలుగు: కొరియర్ పేరుతో  ఓ వ్యక్తిని సైబర్ చీటర్లు మోసగించారు. బంజారాహిల్స్​కు చెందిన వ్యక్తి డీహెచ్ఎల్ కొరియర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బాధితుడికి కాల్ వచ్చింది. డెలివరీ కోసం రెండుసార్లు ప్రయత్నించమని, విఫలమైందని చెప్పారు. మరోసారి డెలివరీ కోసం రూ.25 చెల్లించాలని ఓ లింక్​ను పంపించారు. 

నిజమేనని నమ్మి బాధితుడు ఆ లింక్ ను ఓపెన్ చేసి.. తన క్రెడిట్ కార్డు వివరాలు ఓటీపీ నమోదు చేశారు. వెంటనే అతని కార్డు నుంచి రూ.2,49,616 డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో ఖంగుతిన్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.