ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసులో 8 మంది అరెస్ట్

ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసులో 8 మంది అరెస్ట్

బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసులో 8 మందిని  బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్వింద్ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు.  ఇదే ఘటనపై ఎమ్మెల్సీ కవితపై  ఎంపీ అర్వింద్ కూడా ఫిర్యాదు చేశారు. 

బంజారాహిల్స్ లోని ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం ఉదయం కొందరు దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి ఫర్మీచర్, దేవుడి ఫోటోలు, అద్ధాలు ధ్వంసం చేశారు. అర్వింద్ తల్లిని బెదిరించారు. దీంతో అర్వింద్ తల్లి విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో పలువురు టీఆర్‌‌ఎస్‌‌ నాయకులపై బంజారాహిల్స్‌‌ పోలీసులు నాన్‌‌ బెయిలబుల్‌‌ కేసులు నమోదు చేశారు.


పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో


1 )మన్నే గోవర్ధన్ రెడ్డి
2 )రాజారామ్ యాదవ్
3) సత్యనారాయణ
4)భీమ్ రాజ్
5) కడారి స్వామి
6) చింత శ్రీ కుమార్
7) ఆంజనేయులు
8)జంగయ్య