న్యూఢిల్లీ: బ్యాంకు కస్టమర్లు తమ ఖాతా కోసం వచ్చే నెల నుంచి నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ సెటిల్మెంట్లలో ఒకే తరహా విధానాన్ని అమలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకింగ్ (సవరణ) చట్టం, 2025 కింద నామినేషన్‌కు సంబంధించిన కీలక నిబంధనలు నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
బ్యాంకింగ్ చట్టాన్ని (సవరణ) ఈ ఏడాది ఏప్రిల్ 15న నోటిఫై చేశారు. కస్టమర్లు ఒకేసారి లేదా వరుసగా నలుగురి వరకు వ్యక్తులను నామినేట్ చేయవచ్చు. తద్వారా డిపాజిటర్లకు, నామినీలకు క్లెయిమ్ సెటిల్మెంట్ సులభతరం అవుతుంది. సేఫ్ కస్టడీలు, లాకర్లకూ ఇవే రూల్స్వర్తిస్తాయి. డిపాజిటర్లు నలుగురి వరకు వ్యక్తులను నామినేట్ చేయవచ్చు. ప్రతి నామినీకి వాటా లేదా శాతాన్ని పేర్కొనవచ్చని ప్రభుత్వం తెలిపింది.
