బీఓబీలో కొలువుల జాతర: ఈ అర్హతలు ఉంటే జాబ్ మీకే..

బీఓబీలో కొలువుల జాతర: ఈ అర్హతలు ఉంటే జాబ్ మీకే..

బ్యాంక్ ఆఫ్​ బరోడా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 08.

పోస్టుల సంఖ్య: 330

పోస్టులు: డిప్యూటీ మేనేజర్ (మాస్ ట్రాన్సిస్ట్ సిస్టమ్) 01, ఏవీపీ1(మాస్ ట్రాన్సిస్ట్ సిస్టమ్) 01, డిప్యూటీ మేనేజర్ (అకౌంట్ అగ్రిగేటర్) 02, డిప్యూటీ మేనేజర్ (ఓఎన్​డీసీ) 01, డిప్యూటీ మేనేజర్ (డిజిటల్ ప్రొడక్ట్) 01, ఏవీపీ1(డిజిటల్ ప్రొడక్ట్) 01, డిప్యూటీ మేనేజర్(మొబైల్ బిజినెస్ అప్లికేషన్) 01, ఏవీపీ1(మొబైల్ బిజినెస్ అప్లికేషన్) 01, డిప్యూటీ మేనేజర్ (డిజిటల్ లెండింగ్) 10, అసిస్టెంట్ మేనేజర్(ఎంఎస్ఎంఈ– సేల్స్) 300, డిప్యూటీ మేనేజర్ (వెండర్ రిస్క్ మేనేజ్ మెంట్ స్పెషలిస్ట్) 02, ఏవీపీ1(వెండర్ రిస్క్ మేనేజ్​మెంట్ స్పెషలిస్ట్) 02, డిప్యూటీ మేనేజర్ (గ్రూప్ రిస్క్ మేనేజ్​మెంట్) 02, ఏవీపీ 1(గ్రూప్ రిస్క్ మేనేజ్​మెంట్) 01, డిప్యూటీ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ రిస్క్) 01, ఏవీపీ 1(సైబర్ సెక్యూరిటీ రిస్క్) 02. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్​లో ఎలిజిబిటీని చెక్ చేసుకోగలరు. 

వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 22 ఏండ్లు, గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: జులై 30. 

లాస్ట్ డేట్: ఆగస్టు 19. 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్, మహిళలకు రూ.175.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు bankofbaroda.in వెబ్ సైట్​లో సంప్రదించగలరు. 

►ALSO READ | ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్: ఇంటర్ పాసైతే చాలు, వేంటనే అప్లయ్ చేసుకోండి