నిఖత్ జరీన్ కు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ సన్మానం

నిఖత్ జరీన్ కు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ సన్మానం

వచ్చే కామన్వెల్త్ , ఒలింపిక్స్ గేమ్స్ లో పతకాలు సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు ఉమెన్స్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ గోల్డ్ మెడలిస్ట్ నిఖత్ జరీన్. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగినైన తనకు బ్యాంక్ అధికారులు ఇచ్చిన సపోర్ట్ వల్లే మెడల్ సాధించినట్లు తెలిపారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర లిఖించిన నిఖత్ ను నాంపల్లి బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో అధికారులు సహా తోటి ఎంప్లాయ్స్  ఘనంగా సన్మానించారు.

ఇదే బ్రాంచ్ లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగంలో చేరిన తరువాత తాను ఎక్కువ సమయం ప్రాక్టీస్ కే కేటాయించానని..దాని వల్లనే నేషనల్ , వరల్డ్ ఛాంపియన్ షిప్ లో మెడల్స్ సాధించినట్లు జరీన్ చెప్పారు. భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధించి దేశానికి పేరు తీసుకొస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా జరీన్ కు తమ సహకారం ఎప్పుడు కొనసాగుతుందని..ఆమె అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు చేయూత అందిస్తామని బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం వివేకానంద దుబే స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం

నీరజ్ పన్వార్ కుటుంబసభ్యులను కలిసిన సీవీ ఆనంద్

కేసీఆర్ ఊసరవెల్లి