బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మేనేజర్ ఉద్యోగాలు.. జీతం నెలకు రూ. లక్షా 40 వేలు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మేనేజర్ ఉద్యోగాలు.. జీతం నెలకు రూ. లక్షా 40 వేలు

పుణెలోని బ్యాంక్ ఆఫ్ ​మహారాష్ట్ర మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 30. 

  • పోస్టుల సంఖ్య: 350. 
  • పోస్టులు:  ఐటీ, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ సెక్యూరిటీ, ఐఎస్ ఆడిట్, సీఐఎస్ఓ, ట్రెజరీ, ఇంటర్నేషనల్ బిజినెస్, లీగల్, ఫైనాన్షియల్ మేనేజ్​మెంట్స్ అండ్ అకౌంట్స్, క్రెడిట్, సీఏ, ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్​మెంట్, మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ విభాగాల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులు భర్తీచేయనున్నారు. 
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బి.టెక్/ బీఈ, ఎంఎస్సీ, ఎంసీఏలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
  • జీతం : రూ. 68, 420 - 1, 40, 500 ( స్కేల్ 2 నుంచి 6 వరకు )
  • వయోపరిమితి: 20 నుంచి 50 ఏండ్ల మధ్యలో ఉండాలి.
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 10. 
  • లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30.
  • అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.118. 
  • సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • పూర్తి వివరాలకు bankofmaharashtra.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.