ధాన్యం కొన్నారు గానీ.. డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు

 ధాన్యం కొన్నారు గానీ.. డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు
  • టీచర్ల నియామకాలు పూర్తయ్యే వరకు విద్యావాలంటీర్లను కొనసాగించాలి
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

మంచిర్యాల జిల్లా: రైతు రుణమాఫీ పథకం అమలు చేయకపోవడంతో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు చేసి చాలా రోజులు అవుతున్నా రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్ల నియామకాలు పూర్తయ్యే వరకు విద్యా వాలంటరీలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్  నల్లాల భాగ్యలక్ష్మి తో కలిసి ఇవాళ జరిగిన జడ్పీ సమావేశానికి ఆయన హాజరయ్యారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు  చాలా మంది టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు జడ్పీ సమావేశానికి హాజరుకాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్పీ చైర్ పర్సన్ దళిత మహిళ కావడంతో ఈ విధంగా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దళిత ప్రజాప్రతినిధి పట్ల రాజకీయ వికృత క్రీడ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్య అలాగే ఉంది.. విత్తనాలు రాయితీపై సరఫరా చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.