సెప్టెంబర్ నెలలో 8 రోజులు బ్యాంక్ సెలవులు

సెప్టెంబర్ నెలలో 8 రోజులు బ్యాంక్ సెలవులు

సెప్టెంబరు నెలలో హైదరాబాద్ లోని బ్యాంకులను మొత్తం ఎనిమిది రోజుల పాటు సెలవులు ఉన్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది.  వాస్తవానికి ఈ నెలలో దేశవ్యాప్తంగా నాలుగు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో  కలిపి మొత్తం 17 సెలవులు ఉండబోతున్నాయి. సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండకపోవచ్చు.  కాబట్టి, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి బ్యాంకు మొత్తం 17 రోజులు మూసివేయబడదు. 

హైదరాబాద్‌లో నాలుగు  ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం బ్యాంకులు మూతపడనున్నాయి.  వీటితో పాటు అదనంగా, సెప్టెంబర్ 7, 18, 28 తేదీల్లో బ్యా్ంకులు  మూసివేయబడి ఉంటాయి.

సెప్టెంబర్ 2023లో బ్యాంక్ సెలవుల జాబితా

  • 3 సెప్టెంబర్ 2023: ఆదివారం. 
  • 6 సెప్టెంబర్ 2023: శ్రీ కృష్ణ జన్మాష్టమి
  • 7 సెప్టెంబర్ 2023: శీకృష్ణ జయంతి.  దీన్ని గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, రాజస్థాన్, జమ్ము, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ రాష్ట్రాలలో సెలవు దినంగా పరిగణిస్తారు.
  • సెప్టెంబర్ 9, 2023: రెండవ శనివారం.
  • సెప్టెంబర్ 10, 2023: ఆదివారం.
  • సెప్టెంబర్ 17 2023: ఆదివారం.
  • సెప్టెంబర్ 18, 2023: వరసిద్ధి వినాయక వ్రతం, వినాయక చవితి.
  • సెప్టెంబర్ 19 2023: గణేష్ చతుర్థి. గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, గోవా ప్రాంతాలలో 19వ తేదీ సెలవు దినంగా పరిగణిస్తున్నారు.
  • సెప్టెంబర్ 20, 2023: గణేష్ చతుర్థి 2వ రోజు నుఖాయ్ ఒడిశాలో దీన్ని జరుపుకుంటారు.
  • సెప్టెంబర్ 22, 2023: శ్రీ నారాయణ గురు సమాధి చెందిన రోజు కేరళలో ఇది ప్రాంతీయ సెలవు.
  • సెప్టెంబర్ 23, 2023: నాల్గవ శనివారం సెలవు. ఇదే రోజు మహారాజా హరి సింగ్ పుట్టినరోజు. జమ్ము& శ్రీనగర్ లో ఇది ప్రాంతీయ సెలవురోజు.
  • సెప్టెంబర్ 24, 2023: ఆదివారం
  • సెప్టెంబర్ 25, 2023: ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ.
  • సెప్టెంబర్ 27, 2023: మిలాద్-ఎ-షెరీఫ్ ఇది మహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజు.
  • సెప్టెంబర్ 28, 2023: ఈద్ అల్-అధా లేదా మిలాదున్నబి. ఈ రోజు జాతీయ సెలవు దినం. అన్ని బ్యాంకులు సెలవు దినంగా పాటిస్తాయి.
  • సెప్టెంబర్ 30, 2023: అదివారం.

ఈ ప్రత్యేక రోజులలో బ్యాంకులు విరామం తీసుకుంటున్నప్పటికీ, మీరు ఆన్‌లైన్ సేవల ద్వారా మీ బ్యాంకింగ్ పనులను నిర్వహించవచ్చు.