రేపటి నుంచి దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకుల సమ్మె

రేపటి నుంచి దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకుల సమ్మె

వేతన సవరణ డిమాండ్‌తో రేపటి(శుక్రవారం)నుంచి రెండు రోజుల పాటు జాతీయ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. దీంతో రెండు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూత పడనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 20శాతం పెంచాలని ప్రధాన కార్మిక కమిషనర్‌తో యునైటెడ్‌ ఫోరమ్‌ ఫర్‌ బ్యాంక్ యూనియన్స్‌ నాయకులు జరిపిన చర్యలు విఫలమయ్యాయి. దీంతో ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో (శుక్రవారం, శనివారం) దేశ వ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే …మార్చి 11 నుంచి మూడు రోజుల సమ్మె చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు యూనియన్‌ నాయకులు. వినియోగదారులు తాము చేపట్టనున్న సమ్మెకు సహకరించాలని కోరారు.